సింగర్ సునీత మ్యారేజ్ డేట్ ఫిక్స్

సింగర్ సునీత మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా సెలెబ్రేట్ చేసుకున్న ఈ జంట.  ఇక ఆమె పెళ్లి ఈ నెల 27న జరిగే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆ తేదీన సునీత, రామ్ ల పేర్లపై ముహుర్తం కుదరలేదని, జనవరి 9న సునీత, రామ్‌ వీరపనేని వివాహం జరగనున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో పెళ్లికి కొందరు ప్రముఖులను మాత్రమే ఆహ్మానించనున్నారని సమాచారం.

సునీతకు 19 యేళ్ల వయసులోనే కిరణ్ తో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే భర్త తీరుతో విసిగిపోయిన సునీత అతడితో విడాకులు తీసుకొంది. ఇక రెండో పెళ్లిపై సునీత స్పందిస్తూ.. ‘ప్రతితల్లి మాదిరిగానే నా పిల్లలు జీవితంలో స్థిరపడాలని ఎన్నో కలలుకన్నాను. అదే సమయంలో నేను సంతోషంగా ఉండాలని ఆశించే వివేకంతో ఆలోచించే తల్లిదండ్రులు, పిల్లలు నా తోడుగా ఉన్నందుకు గర్వపడుతున్నా. నేను ఆనందించే మధుర క్షణాలు వచ్చాయి. మంచి స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా రామ్‌ నా జీవితంలోకి ప్రవేశించారు. త్వరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాం’ అని తెలిపిన సంగతి తెలిసిందే.