ఆరోసారి ఫలించని చర్చలు

ఢిల్లీలో రైతులు వ్యవసాయ చట్టానికి వ్యతిరేకిస్తూ గత 14 రోజుల నుంచి నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు నిన్న రైతులు భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు. ఈ మేరకు నిన్న భారత బంద్ ను విజయ వంతంగా నిర్వహించారు.. అయితే కొన్ని చోట్ల బంద్ చేస్తున్న నిరసన కారులు ఉద్రిక్తం చేశారు. మరి కొన్ని చోట్ల ఇప్పటికీ బంద్ కొనసాగుతోంది.. ఇకపోతే దేశంలో రైతుల కోసం నిరసనలు ఎక్కువ కావడంతో అమిత్ షా రైతులను చర్చలకు ఆహ్వానించిన విషయం విదితమే. నిన్న సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతులతో చర్చలు జరుపగా.. గతంలో జరిపిన ఐదు సార్లు చర్చల మాదిరిగానే రైతులకు అనుకున్న ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు జరిపిన ఆరోసారి చర్చలు కూడా రైతులకు సంతృప్తిని ఇవ్వలేదని తెలుస్తుంది..

ఈ సమావేశంలో చట్టాలకు సంబంధించి రాతపూర్వకంగా ప్రతిపాదనలు పంపిస్తామని అమిత్‌ షా చెప్పినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి… ఐతే కొత్తసాగు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేదని రైతు సంఘాల నేతలు తెలిపారు. కేంద్ర ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ప్రతిపాదనలు అందిన తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ వెల్లడించారు..ఇవాళ రైతు సంఘాలతో మరోవిడత చర్చలు జరుతామని కేంద్రం గతంలోనే ప్రకటించింది. ఈ లోపే కేంద్ర హోం మంత్రి ఒక రోజు ముందుగానే రైతు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. అవి కూడా వారికి ఊరటన కలిగించలేదు.. దీంతో మళ్లీ రైతులు రోడ్డెక్కారు..