ఆపదలో ఆదుకొనేందుకు జనసైనికులు ముందుంటారు

భీమవరం: ఆకివీడు గ్రామానికి చెందిన జనసేన కుటుంబ సభ్యులు అయిన వై లక్ష్మి క్యాన్సర్ తో బాధపడుతూ వడ్లపూడి ఓమి బాబా క్యాన్సర్ హాస్పటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి బ్లడ్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ విషయంగా గనమ్మ గాజువాక జనసేన వీరమహిళ శాలినిని సంప్రదించడం జరిగింది. సంప్రదించిన వెంటనే శాలిని గారు నిండు మనసుతో వారిని ఓదార్చి, ధైర్యం చెప్పి నేను ఏర్పాటుచేస్తానని వాళ్ళకి మాటిచ్చి వెంటనే గ్రూపులో మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ చూసి కొంతమంది జనసైనికులు శాలిని గారికి ఫోన్ చేసి మేము ఇస్తామని ముందుకు రావడం జరిగింది. అందులో ముందుగా 72వ వార్డు చెందిన జనసైనికుడు నగేష్ గురువారం బ్లడ్ ఇవ్వడం జరిగింది. వారికి బాధిత వై లక్ష్మి కుటుంబసభ్యులు హృదయపూర్వక పాదాభివందనాలు తెలిపారు. అలాగే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిన అప్పటినుంచి డోనరు నగేష్ వచ్చినంత వరకూ ఉండి బ్లడ్ ఇచ్చిన తరువాత నగేష్ గారికి మన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో ఫ్రేమ్ తయారు చేయించి నగేష్ కు అందజేయడం జరిగింది. అలాగే ఆపదంటే నేనున్నాను అనే ముందు వరుసలో ఉన్నటువంటి శాలినికి కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలిపారు.