తంగల వేణుగోపాల్ కు ఘన సన్మానం

పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజాసేవకు అంకితమైన తంగల వేణుగోపాల్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ ఆకాంక్షించారు. ‌మంచి మనిషి స్నేహశీలి, మృదు స్వభావి, సమాజ హీతం కోరే శ్రేయోభిలాషి అయిన తంగల వేణుగోపాల్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ది గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకున్న సందర్భంగా.. శుక్రవారం బెంగుళూరు నందు వేణుగోపాల్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తంగల వేణుగోపాల్ భవిష్యత్తులో మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంగారపు రామదాస్ చౌదరి, జంగాల శివరామ్ రాయల్, లీగల్ సెల్ అమరనారాయన చేనేత ప్రదన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె టౌన్ ప్రెసిడెంట్ జంగాల శక్తి, మదనపల్లె రూరల్ ప్రెసిడెంట్ రోనూరు బాబు, జాయింట్ సెక్రటరీ గజ్జెల రెడ్డెప్ప, తోట కళ్యాణ్ జగదీష్, రెద్దమ్మ, గండికోట లోకేష్ తదితరులు పాల్గొన్నారు.