వీరఘట్టం జనసేన ఆధ్వర్యంలో నేతాజీ కి ఘన నివాళులు

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గ పరిధి వీరఘట్టం మండలంలో జనసేన ఆధ్వర్యంలో నేతాజీ కి ఘననివాళులు స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ ఆశయాలు, త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తాయని, నేతాజీ తన అసాధారణమైన దేశభక్తితో, అద్భుతమైన ప్రసంగంతో యువతను సంఘటితం చేసి పరాయి పాలననుండి విముక్తి చేయడానికి పునాది వేశాడని జనసేన నాయకులు మత్స.పుండరీకం వ్యాఖ్యానిఒచారు. నేతాజీ ఆశయాలు, త్యాగాలు ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని అన్నారు. అలాగే ప్రతి ఒక్క జనసైనికడు గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజలను చైతన్య పరచాలని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ దత్తి గోపాలకృష్ణ, ఎనారై వఒడాన వినయ్ కుమార్, చింత గోవర్ధన్, వావిలపల్లి నాగభూషణం, వజ్రగడ్డ రవికుమార్, రౌతు మురళి, తుముల గోవింద రావు జనసైనికులు పాల్గొన్నారు.