Krishna: జనసేన చొరవతో రాహదారి సమస్యకు పరిష్కారం

శనివారం 11 గంటలకు సర్వే నిర్వహించి రహదారి విడగొడతాం అని జనసేన నాయకులకు చాట్రాయి మండలం తాసిల్దార్ విశ్వనాథం హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని భురగగూడెంలో వెల్లంకి శ్రీమన్నారాయణ అనే రైతు, జనసేన నాయకులను కలిసి రైతు తన గోడును వివరించారు. వైఎస్సార్సీపీ కి చెందిన దేశిరెడ్డి రాఘవరెడ్డి అనుచరులు రికార్డు పరంగా ఉన్న దారిన నడవకుండా మందపాటి సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి అనేవారు కత్తి వేసుకు వచ్చి పొలంలోకి వెళ్ళేనీయకుండ మూడు సంవత్సరాలుగా అడ్డు పడుతున్నారని తెలిపాడు. తహశీల్దార్, SI గారు రహదారి హక్కు తనకు ఉన్నదని చెప్పినప్పటికీ, మూర్ఖంగా వెళ్లనీయ కుండా మూడు సంవత్సరాల నుంచి అడ్డుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని కన్నీరు పెట్టుకున్నాడు. వైఎస్సార్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పొలంలోకి రానియ్యను అని రాఘవరెడ్డి మంగళవారం బెదిరించారని జనసేన నాయకులకు రైతు తెలిపారు. దీనిపై ఇప్పటికే రైతు ఎస్పీకి, చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందనీ… ఈ విషయంపై రైతు రహదారి సమస్య పరిష్కారం చేయాలని జనసేనపార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామ్ ఆధ్వర్యంలో జనసేన నాయకుల బృందం భూరగగూడెంలోని రైతు నివాసం వద్ద వెల్లంకి శ్రీమన్నారాయణ నుండి పూర్తి వివరాలు తెలుసుకొని చాట్రాయి మండల తాసిల్దార్ విశ్వనాథం, సబ్ ఇన్స్పెక్టర్ కే.ప్రతాపరెడ్డిలతో చర్చలు జరిపి సామరస్య వాతావరణంలో సమస్య పరిష్కారానికి మార్గం చూపాలని కోరారు. దీనిపై తాసిల్దారు శనివారం ఉదయం 11 గంటలకు పొలం సర్వే నిర్వహించి రహదారి విదగొడతామని జనసేన నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమమలో జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైయస్ఆర్సిపి ప్రభుత్వం ఆచరణలో రైతులను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. రైతు లేకపోతే, పంట పండించే వారుపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి అన్నారు. పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ అధికారుల మీద నమ్మకం ఉందని, వారు ఇచ్చిన హామీ శనివారం నిలబెట్టుకోవాలని కోరారు. లేకపోతే జనసేనపార్టీ ఆధ్వర్యంలోనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. కాపు సంఘం విభాగం అధ్యక్షులు రేవంసెట్టి
సత్యనారాయణ, నూజివీడు నియోజకవర్గం కాపు సంఘం అధ్యక్షులు ఏనుగులవెంకటేశ్వరరావు,
నూజివీడు నియోజకవర్గం నాయకులు మరీదు శివరామకృష్ణ, ఏనుగులు చక్రి, తోట వెంకట్రావు, యాదాల వెంకట్, చాట్రాయి మండలం జనసేన నాయకులు తుమ్మల జగన్, ఆరేల్లి కృష్ణ, పాపారావు, సునీల్, విసన్నపేట మండల నాయకులు శ్రీనివాస్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.