పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో – అగ్ని ప్రమాద బాధితులను ఆదుకున్న జనసైనికులు

ఘంటసాల: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఘంటసాల మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆర్థిక సహకారంతో అగ్నిప్రమాద బాధితులకు చేయూతనందించారు. ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట గ్రామానికి చెందిన పి. శ్రీను గృహం ఇటీవల జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం కాగా.. జనసేన నాయకులు మంగళవారం సాయంత్రం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఘంటసాల మండల జనసైనికులు సమకూర్చిన 25 కేజీల రైస్ బ్యాగ్, 6500రూ.ల నగదును అగ్నిప్రమాద బాధితులకు అందజేశారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నియోజకవర్గంలో ఆపదలో ఉన్నవారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేతనయినంత సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాద బాధితులకు, అనారోగ్య సమస్యలకు గురైనవారికి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో జనసైనికులు ముందున్నారని కొనియాడారు.

జనసేన పార్టీ మండల అధ్యక్షులు కోన రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీను కుటుంబ అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోవడం బాధాకరమని, ఘంటసాల మండల జనసైనికులందరం కలిసి సాయం అందించటానికి ముందుకు వచ్చామన్నారు. ఇలానే మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చేస్తామని తెలిపారు.

ఘంటసాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కోన రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూషడం సర్పంచ్ అంకం మారుతీరావు, జనసైనికులు సగ్గున పవన్, కొండవీటి శ్రీనివాసరావు, యార్ల శ్రీకాంత్, ఆకుల మధు, వైశేట్టి రవికుమార్, మాజీ సర్పంచ్ శివ శ్రీనివాసరావు, స్థానికులు పి పోతురాజు, వేమూరి రాజేంద్ర, రెడ్రోతు కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.