జనసేన నాయకులు బొర్రా అరెస్ట్ అక్రమం

సత్తెనపల్లి నియోజకవర్గం: పాపిశెట్టిపాలెం గ్రామస్థుల సమస్యలను సంబందిత అధికారుల ధృష్ఘికి తీసుకెళ్ళడానికి ఉద్యుక్తులౌతున్న సత్తెనపల్లి జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావుని మంగళవారం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసారు. బొర్రా వెంకట అప్పారావు అక్రమ అరెస్ట్ ను జిల్లా జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకరిద్దరిని నిర్భందించినంత మాత్రాన జనసేన పార్టీని ఆపడం ఎవ్వరి తరం కాదు. జనసేన పార్టీ కేవలం రాజకీయపార్టీ మాత్రమే కాదు. ఒక ఉద్యమం. ఈ ఉద్యమం ఆపితే ఆగేది కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సత్తెనపల్లి మునిసిపల్ కౌన్సిలర్ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు మండల కమిటీ వారు గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ వారు జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగినది.