టీడీపీ నిరసన దీక్షకు సొమరౌతు అనురాధ సంఘీభావం

వేమూరు నియోజకవర్గం: వేమూరు మండలం, కాకర్లముడి, చదలవాడ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా సోమవారం చదలవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న నిరసన దీక్షకు ఉమ్మడి కార్యాచరణ సంఘీభావం తెలుపుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి సొమరౌతు అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు దోపిడీ చేసి ఆధారాలతో జైల్ శిక్ష అనుభవించిన జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏదో విధంగా జైల్ కి పంపాలని ఉద్దేశ్యంతో అక్రమ కేసులు బనాయించారు అన్నారు. శాంతియుతంగా జరిగే కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అనిచివెస్తుంది అన్నారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కూడా దుర్వినియోగం చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ మంత్రి వర్యులు నక్క ఆనంద బాబు. జొన్నలు గడ్డ విజయబాబు, బోల్లిముంత కోటేశ్వరరావు, అమ్మిసెట్టీ కిషోర్, నాయకులు పాల్గొన్నారు. జనసేన నాయకులు మండల అధ్యక్షులు వుస రాజేష్, ఎంపీటీసీ నగేష్, చవలి సర్పంచ్ విష్ణు మొలకల శ్రీనివాస్. జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.