భీమవరం జనసేన బహిరంగ సభ విజయవంతం కావాలని కోటసత్తెమ్మకు ప్రత్యేక పూజలు

నిడదవోలు నియోజకవర్గం: తొలిఏకాదశి సందర్భంగా గురువారం నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయం వద్ద జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని, భీమవరంలో జరిగే బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుకుంటూ నిడదవోలు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం(పి వి ఆర్) ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో వృద్దులకు మరియు వికలాంగులకు భోజన ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మరియు నిడదవోలు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేసే విధంగా మనం మరింత కష్టపడాలని జనసైనికులకు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారాహి విజయయాత్ర పట్ల ఇప్పటికే ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని, వైసీపీ నాయకులుకు భయం పుట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయన స్థాయి మర్చిపోయి వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నారని ప్రజలు ఇప్పటికే గ్రహిస్తున్నారని అందుకే ప్రజలందరూ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ ఈ ప్రభుత్వనికి త్వరలో బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కాకర్ల నాని, కారింకి వరప్రసాద్, కరీబండి ఈశ్వరావు, వీరమహిళ బెల్లంకొండ పుష్పావతి, వద్దిరెడ్డి శివగణపతిరాజు, కస్తూరి వెంకటసుబ్బారావు, చిరంజీవి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.