క్రీడలను ప్రోత్సహించాలి: బర్మా ఫణి బాబు

  • దిగవల్లి ప్రీమియర్ లీగ్ విజేతలకి బహుమతుల ప్రఢానం చేసిన బర్మా ఫణి బాబు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం, పడమట దిగవల్లి గ్రామంలో రవి కిరణ్ క్రికెట్ గ్రౌండ్లో దిగవల్లి ప్రీమియర్ లీగ్ (క్రికెట్ నాకౌట్ మ్యాచుల) ఫైనల్ మ్యాచ్ కి విచ్చేసి ద్వితీయ బహుమతి ట్రోఫీ మరియు నగదు బహుమతి అందజేసిన జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం సమన్వయకర్త బర్మా ఫణి బాబు.. అనంతరం బర్మా ఫణి బాబు మాట్లాడుతూ క్రీడలనూ ప్రోత్సహించడంఎంతో అవసరం అని, ప్రతి మండలానికి ఒక స్టేడియం ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలని, రాబోయే రోజుల్లో వచ్చే జనసేన, టిడిపి గవర్నమెంట్ లో ప్రతి మండలానికి ఒక క్రికెట్ స్టేడియం ఉండేటట్టు ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పినారు.
ఈ కార్యక్రమంలో ఫణి బాబుతో పాటు జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యురాలు నిట్ల ఉమామహేశ్వరి, సీనియర్ వీర మహిళ జక్కుల లక్ష్మి, జనసేన నాయకులు పాశం నాగబాబు, ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్, ఇమ్రాన్, గొల్లపల్లి గిరి, కడియం శీను మరియు తదితరులు పాల్గొన్నారు.