శ్రీ రాజరాజేశ్వరి ఫ్లోర్ మిల్లు ప్రారంభించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం పట్టణంలో గుట్లవీధి కాకినాడ రోడ్డు శ్రీ రాజరాజేశ్వరి ఫ్లోర్ మిల్లు నూతన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి మిల్లు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ మన ఆగంటి ఉమా, ఆగంటి శ్రీను, హరి ఆహ్వానం మేరకు ఇక్కడకు రావడం ఆడపడుచులు అన్నదమ్ములతో కలిసి మిల్లు ప్రారంభించడం ఆనందంగా ఉందని, వీరి వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి, జనసేన టౌన్ నాయకులు బుర్రా సూర్యప్రకాష్ రావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, కసిరెడ్డి నాగేశ్వరరావు, గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, పెదిరెడ్ల భీమేశ్వరరావు, బుర్రా విజయ్, నామ శ్రీకాంత్, తోట సతీష్, ఆగంటి రాఘవ, నాగమణి, అమ్మజీ, సీతమ్మ, పద్మ, లక్ష్మి, జ్యోతి, జనసైనికులు, వీరమహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.