సువర్ణమ్మకు జనసేన తరపున పెన్షన్ అందజేత

పాణ్యం: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ వార్డులో నివసిస్తున్న 70 సం.రాల వితంతు వృద్ధురాలు సువర్ణమ్మకు 7వ నెల పింఛను అందించిన నియోజకవర్గ ఇంచార్జ్ సురేష్ బాబు చింత. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సువర్ణమ్మ గారు అన్ని విధాలా పింఛనుకు అర్హులైన ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడం బాధాకరమైన విషయం, గత 7నెలలుగా ఈమెకు జనసేన పార్టీ తరఫున స్థానిక నాయకులు బాలు గారు మరియు వారి మిత్ర బృందం కలిసి రాష్ట్రంలోనే ప్రభుత్వం కంటే ముందుగా 2751/- రూపాయలను ఈ నెల జనసేన పార్టీ తరఫున పింఛను ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బెల్లం కొట్టిన రాయిలా పడి ఉందని ప్రభుత్వాన్ని విమర్శిచారు. 2024లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలో మొదటి పింఛను ఈమె నుండే మొదలు పెడతామని సురేష్ బాబు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి పెద్దమ్మకు పెన్షన్ శాంక్షన్ అయ్యేవరకు ప్రతి నెల జనసేన పార్టీ అండగా ఉంటూ జగన్ ప్రభుత్వం ఇవ్వలేని పెన్షన్ ను జనసేన పార్టీ ఇస్తుందని హెచ్చరించారు.