నవరాత్రుల ప్రారంభ ఉత్సవాలలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామంలో విజయదశమి శ్రీదేవి నవరాత్రుల ప్రారంభోత్సవ సందర్బంగా.. గ్రామంలో పలు చోట్ల భవానీ ప్రతిరూపాల్ని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దర్శించుకుని భవాని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరేంద్రపురం గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ ప్రగడ నాగేశ్వరరావు, నరేంద్రపురం గ్రామపంచాయతీ సర్పంచ్ తంగళ్ళ ముసలయ్య, చెవిటపల్లి అబ్బులు, ప్రగడ బాబురావు, ప్రగడ రాంబాబు, నీలం ప్రసాద్, సంగీత సత్తిబాబు, చాట్ల రాజా, కోన శ్రీనివాసులు, నక్కిన వీరపండు, ఆముదాల అనిల్, చిట్టిప్రోలు సత్తిబాబు, గెద్దటి అంజిబాబు, నీలా ప్రసాద్, ఆదిమూలం త్రిమూర్తులు, నరాల పండు, యర్రంశెట్టి పోలరావు తదితరులు పాల్గొన్నారు.