ఈఓ కి వినతి ఇచ్చిన శ్రీకాళహస్తి పట్టణ జనసేన

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆదేశాల మేరకు బుధవారం రేణిగుంట పట్టణ నాయకులు రేణిగుంట పంచాయితీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. రేణిగుంట పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న పంచాయితీ కి చెందిన సర్వే నెంబర్ 769/2 లో గల స్థలం ఖాళీగా ఉన్నది. ఈ స్థలంలో గతంలో ఉన్న షాపు లను ట్రాఫిక్ సమస్యల దృష్యా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు 2017 డిసెంబర్ లో తొలగించడం జరిగింది. ఇపుడు ఆ స్థలంలో కేవలం స్థలాన్ని బాడుగకు ఇస్తున్నట్టు పంచాయితీ 25-02-2022 న తీర్మానం చెయ్యడం జరిగిందని జనసేన దృష్టికి వచ్చింది. ఖాళీ స్థలాన్ని ఏ ఆధారం తో అద్దెకి ఇస్తున్నారని, అతి పెద్ద కూడలి అయిన రేణిగుంట బస్టాండ్,రైల్వే స్టేషన్ వద్ద గల ఈ స్థలం లో షాపు లు నిర్మాణం చేసి బాడుగకు ఇస్తే పంచాయితికి ఎక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా ఖాళీ స్థలాన్ని బాడుగకు స్వార్థం తో కొంత మందికి అప్పగించారని ,ఈ స్థలం బాడుగకు వేలం వేస్తున్నట్టు ఎలాంటి బహిరంగ ప్రకటనలు చెయ్యలేదు. వేలంపాటకి ప్రకటన ఇచ్చినట్లయితే ప్రజలు అందరూ పాల్గొనే వారు, తద్వారా పంచాయతీకి ఎక్కువ ఆదాయం వచ్చేట్టు వేలంపాట లో బాడుగ నిర్ణయం జరిగేది. గతంలో కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఈ స్థలాలను బాడుగకు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకం అయిన చర్య అని, బాడుగకు ఇవ్వాలని తలిస్తే కలెక్టర్ గారి అనుమతితో, ప్రజా అభిప్రాయంతో పంచాయతీ నిధులతో అక్కడ షాపులు నిర్మాణం చేసి, బహిరంగంగా వేలంపాట ప్రకటన ఇచ్చి ప్రజలు అందరూ పాల్గొనేలా చేసి బాడుగకు ఇస్తే పంచాయతీకి ఎక్కువ ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది పంచాయతీకి ఆదాయం ఎక్కువ వస్తే, అభివృద్ధికి ఉపయోగపడుతుందని, తక్షణమే ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు ఉపసంహరణ చేసుకుని, ప్రజాస్వామ్య బద్ధంగా కార్యక్రమాలు చెయ్యాలని ఈఓ వినతి ఇచ్చిన పట్టణ జనసేన నాయకులు భాస్కర్ బాబు, త్యాగరాజుకి, జ్యోతి కుమార్, లోకనాధం, తదితరులు.