జనసేన క్యాలెండర్‌ను ఆవిష్కరించి.. శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా 2023 నూతన సంవత్సర జనసేన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాలెండర్ లో అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మరియు సిద్దాంతాలను అద్భుతంగా పొందుపరచి ప్రజలకు అర్థమయ్యేలా తయారు చేశారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు జనసేన పార్టీ తాడిపత్రి ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జనసైనికులు, నాలుగు మండల నాయకులు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.