శ్రీ నిలగాలమ్మ తల్లిని దర్శించుకున్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ నిలగాలమ్మ తల్లి అమ్మవారి కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని, అమ్మవారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం అన్న సమారాధనకు విచ్చేసిన భక్తులకు స్వయంగా అన్నవితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారికి 5000/- రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితోపాటు మేడిశెట్టి శివరాం, కామిశెట్టి సతీష్, కామిశెట్టి చినకాపు, దాడి గణేష్, బందా రామకృష్ణ, పోలిశెట్టి రాంబాబు, కామిశెట్టి విష్ణు, కామిశెట్టి సుబ్బారావు, దాడి సూర్యారావు, దాడి కృష్ణమూర్తి, పోలిశెట్టి రాంబాబు, కనుమరెడ్డి విజయ్, బొమ్ముల రాజు, మైరెడ్డి సూరిబాబు, కవల రాజు, చెర్ల బుజ్జి, సుంకర బాబ్జి మరియు ఇతర నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.