చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సహాయం అందించిన శ్రీనివాస్

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, పైడియ్యవలస గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తున్న జనసేన పార్టీ నాయకుడు వడ్డిపిల్లి శ్రీనువాసరావు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి సహాయం అందించడం జరిగింది.. వివరాలలోకి వెళితే సతివాడ పానియలు భార్య.. సతివాడ శారధ చనిపోవడం జరిగింది. వారు ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నారు. వారు దిక్కులేని పరిస్ధితుల్లో ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని దృక్పథంతో శ్రీనువాసరావు పెద్దకర్మ చేయడానికి ఒక బియ్యం బస్తా మరియు ఆర్ధికంగా ఆదుకున్నారు. వారికి ఎలాంటి సహాయం కావాలన్నా జనసేన పార్టీ తరుపున మీకు అండగా ఉంటాను అని శ్రీనువాసరావు ఆ కుటుంబానికి హమి ఇచ్చారు.