నేడు తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి నేడు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఉదయం 9 గంటలకు తమిళనాడు రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. స్టాలిన్ తో పాటు 34 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉంది. కరుణానిధి కాబినెట్ లో పనిచేసిన వారికి.. తన మంత్రివర్గంలోను చోటు కల్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల పేర్లతో కూడిన జాబితాను రాజ్ భవన్ లో సమర్పించారు స్టాలిన్. ఈ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా, పుదుచ్చేరీ ముఖ్యమంత్రిగా ఎన్నార్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌ రంగస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.