బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి: జనసేన డిమాండ్

పాలకొండ: వీరఘట్టం మండలం, కొట్టుగుమ్మడ గ్రామానికి చెందిన జూనియర్ లైన్మెన్ గురాన శ్రీనివాసరావు విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తగిలి చావు బతుకుల మధ్య ఉన్నాడు. లైన్మెన్ గురాన ను వైద్య చికిత్స కోసం విద్యుత్ శాఖ అధికారులు శ్రీకాకుళం తరలించారు.. జూనియర్ లైన్మెన్ బంధువులు వీరఘట్టం సబ్ స్టేషన్ పరిదిలో కొట్టుగుమ్మడ మరియు గెడగాం గ్రామ ప్రజలు ఆందోళన చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొట్టుగుమ్మడ గ్రామ ప్రజలు గెడగాం గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏ ఊరులో కూడా సరిగ్గా పని చెయ్యడం లేదు. అలానే ఇప్పుడు గురాన శ్రీనివాసరావుకి జరిగిన సంఘటన మరో ఊరులో ఎవరికీ జరగకూడదు. బాధిత వ్యక్తికి అనుకోని రీత్యా ఏమైనా జరిగినా బాధిత కుటుంబంలో ఒక ఉద్యోగం, 50 లక్షల రూపాయిలు డిమాండ్ చెసారు. అలానే ఆయన తొందరగా కోలుకోవాలని, బాధిత కుటుంబ బాధ్యత మొత్తం ప్రభుత్వం, డిపార్ట్మెంట్ చూసుకోవాలి అనేది వీరఘట్టం మండల జనసేన ఎంపీటీసీ అభ్యర్థి జనసేన జానీ ప్రధాన డిమాండ్ చేసారు. సహకరించిన కొట్టుగుమ్మడ, గెడగాం గ్రామ ప్రజలు పట్టుబట్టడంతో ఎ.ఈ బాలాజీ, ఎడి మోహన్ చక్రవర్తి, స్థానిక ఎస్ఐ, ఎం. వెంకటరమణ జియం వలస ఎస్ఐ, పి. అవినాష్ సబ్ స్టేషనకు చేరుకొని అధికారులుతో మాట్లాడి సర్ది చెప్పండం రెండు గ్రామ ప్రజలు డిమాండ్ కి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కొట్టుగుమ్మడ గెడగాం రైతులు గ్రామ ప్రజలుకి యువత మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి మరియు పేషెంట్ దగ్గర అన్ని విధాలుగా దగ్గర ఉండి చూసుకుంటున్న టీడీపీ మండల నాయుకులు ఉదయాన ఉదయ్ కి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు.