Hyderabad: రిలే నిరాహారదీక్ష ప్రారంభించిన తెలంగాణా జనసేన నాయకులు

తెలంగాణలో డ్రగ్స్ అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి, ఆఫ్ నుండి తరలి వస్తున్న గంజాయి మూలాలను పట్టుకోవాలని, తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేసి డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా ప్రకటించాలని కోరుతూ జనసేనపార్టీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహారదీక్ష ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణా జనసేనపార్టీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.