రహదారుల అభివృద్ధి మరిచిన రాష్ట్ర ప్రభుత్వం: జనసేన నాయకులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ పిలుపు మేరకు రహదారుల దుస్థితిపై నిరసన కార్యక్రమం చేపటారు. ఈ సందర్భంగా మండల అధికారి ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ మాట్లాడుతూ రహదారుల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ఎమ్మిగనూరు కోసిగి రహదారి పై నిరసన కార్యక్రమం చేపట్టి రోడ్ల దుస్థితిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని వృద్ధులు దివ్యాంగులు వాహనదారులు గుంతల మాయమైన రహదారులపై తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి రహదారుల మరమ్మతులు వెంటనే చేపట్టాలని లేనిపక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు వినయ్, షబ్బీర్, రమేష్, రషీద్, కాజా, నరేష్, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.