జనసేనానిని విమర్శిస్తే ఖబర్దార్!: అనంతపురము జనసేన

*రైతాంగాన్ని నట్టేట ముంచిన వైసిపి ప్రభుత్వం..

*బాధిత రైతు కుటుంబాలకు రూ. 7 లక్షలు ఇప్పించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదే..

*మరోసారి అవాకులు పేలితే ప్రతిఘటిస్తాం..

*అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి హెచ్చరిక..

బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర విజయవంతం కావడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదని. అందుకే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు గుప్పిస్తున్నారని. వైసిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హేయమని బుధవారం సప్తగిరి సర్కిల్ లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షులు టీ.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, రాప్తాడు నియోజకవర్గ ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ ఖండించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి భవానిరవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, ఈశ్వరయ్య హాజరయ్యారు.