కోనసీమ జిల్లాల వరద బాధితులను ఆదుకోని రాష్ట్ర ప్రభుత్వం: దారం అనిత

ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని ఆలోచించే ప్రభుత్వాలు, ప్రజలకు వచ్చే కష్టాలను ముందే ఊహించాలి.. దానికి తగ్గ సన్నద్ధత ఉండాలి. కష్టం వచ్చిన తరువాత ఆడుకోవడానికి ముందుండాలి. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి సన్నద్ధత గానీ, ఆదుకొనే పెద్ద మనస్సు గానీ కనిపించడం లేదు. గోదావరి ఉగ్ర రూపం దాల్చి కోనసీమ జిల్లాలను అతలాకుతలం చేస్తుంటే ప్రభుత్వం సహాయక చర్యలలో పూర్తిగా విఫలం అయ్యింది. నాలుగు రోజులుగా తినడానికి తిండి లేక కనీసం మంచి నీరు లేక ఇబ్బంది పడ్డ జనం కడుపు మండి మంత్రి విశ్వరూప్ ని, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ను నిలదీశారు. అధికారులను సరిగ్గా పని చేపించడం మీ బాధ్యత అటువంటి వైపు మీ ప్రయత్నం లోపమే ఈ నిలదీతకి కారణం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు వరద బాధితులను జనసేన నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు స్వయంగా వెళ్లి అవసరమైన సహాయ సహకారాలు చేస్తున్నారు…

ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేస్తే ప్రజల కష్టాలు అర్దం కావు, వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని, కానీ పక్షంలో తీవ్ర ప్రజాగ్రహానికి గురికాక తప్పదని జనసేన తరపున తెలియజేస్తున్నానని మదనపల్లె, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు.