విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆందోళనలు..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని పార్టీలకతీతంగా నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్మిక, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. నిర్ణయాన్ని కచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు పోరాటం ఆగదని చెబుతున్నారు. పెదగంట్యాడ జంక్షన్‌లో నిర్వాసితులకు మద్దతుగా టీఎన్జీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొననున్నారు. మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్ష ప్రజా సంఘాలు రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చాయి. మరోవైపు స్టీల్ ప్లాంటు మెయిన్ గేటు దగ్గర బీఎమ్ఎస్ నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనలో గాజువాక బీజేపీ నాయకులు పాల్గొననున్నారు.