ఐఎఫ్‌బీలో స్టెనోగ్రాఫర్‌, ఎల్‌డీసీ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను వచ్చేనెల 24 లోపు పంపించాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా స్టెనోగ్రాఫర్‌, ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ పోస్టులను భర్తీచేయనుంది.

మొత్తం పోస్టులు: 7

ఇందులో గ్రేడ్‌-2 స్టెనోగ్రాఫర్‌- 1, లోయర్‌ డివిజన్‌ క్లర్క్-1, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌-5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు ఇంటర్‌ పాసై ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్‌ కోర్సు చేసి, హిందీ లేదా ఇంగ్లిష్‌లో నిమిషానికి 80 పదాలు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. ఎల్‌డీసీ పోస్టుకు ఇంటర్‌ పాసై ఇంగ్లిష్‌లో నిమిషానికి 30 పదాలు టైప్‌ చేయగలగాలి. ఎంటీఎస్‌ పోస్టుకు పదోతరగతి పాసై ఉండాలి. 27 ఏండ్లలోపువారై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్‌ను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 24

వెబ్‌సైట్‌: websites www.icfre.gov.in or www.ifb.icfre.gov.in