మహగం గ్రామ వి.డి.సిని రద్దు చేయాలని రోడ్డుపై రాస్తా రోకో

భైంసా మండల పరిధిలోని మహగం గ్రామ విడిసి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అదే గ్రామానికి చెందిన ఆటోలను నడపకూడదని వాళ్ళను భహిష్కరించడం జరిగింది. రెండు రోజులుగా సామరస్యంగా వ్యవహారించిన ఎవరు పట్టించుకోక పోయే సరికి తప్పని పరిస్థితుల్లో రాస్తా రోకో చేయాల్సి వచ్చింది. దాదాపు అరగంట పాటు రోడ్డుపై ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు, నాయకుల పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీన్ని నిలువరించడానికి భైంసా రూరల్ ఇన్స్పెక్టర్ చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇవ్వడంతో రాస్తా రోకో విరమించడం జరిగింది. వి.డి.సి అరాచకాలకు అడ్డు కట్ట వేసి పోలీసులు చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సీపీఎం భైంసా ఏరియా కమిటీ కన్వీనర్ గైని మురళి మోహన్, జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు, ఆటో యూనియన్ అధ్యక్షులు సిరాజ్, డ్రైవర్లు మజర్, సాయినాథ్, శంకర్, భీమ్ రావ్, గౌతం, విక్రం, ఆకాష్, గంగాధర్, విశ్వంబర్, రమేష్, పాపన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు.