విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఉపాధ్యాయులను కేటాయించాలి: పోలిశెట్టి

మైలవరం: స్థానిక ఇబ్రహీంపట్నం మండలం, దామలూరు గ్రామంలో అందుబాటులో ఉన్న ఉర్దూ పాఠశాలలో 34 మంది ముస్లిం విద్యార్థులతోపాటు 97 మంది ఇతర సామాజిక వర్గాలకు చెందిన తెలుగు విద్యార్థులకి కూడా ఉర్దూకి సంబంధించిన సబ్జెక్టులను బోధించడం వలన విద్యార్థులకి పాఠాలు అర్థం కాకపోవటంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలుగు, మరియు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకున్న విద్యార్థులకు ప్రత్యేక టీచర్లను ఏర్పాటు చేయాలని మరియు అవకాశం ఉంటే ఇప్పుడున్న ఉర్దూ పాఠశాలలో కొన్ని తరగతిగదులు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కేటాయించవలసిందిగా కోరుతూ ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పోలిశెట్టి తేజ స్థానిక మండల పరిషత్ ప్రధాన అధికారి నాయక్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దామలూరు గ్రామ అధ్యక్షుడు పంది శ్రీనివాస్, జనసేన పార్టీ స్థానిక నాయకులు చిట్టిబాబు, గణేష్, వినయ్, అజయ్, జనసేన పార్టీ కార్యకర్తలు, మరియు దామలూరు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.