వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లింపు- పల్లెపోరులో బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: జనసేన పల్లెపోరు రెండో విడత పల్లె పోరులో భాగంగా పెంటపాడు మండలం, రామచంద్రపురం గ్రామంలో తాడేపల్లిగూడెం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలని 2024లో వారికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్న ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా దామాషా ప్రకారం వారి నిధులను వారికే కేటాయించి ఇతర వర్గాలతో అభివృద్ధి సూచీలలో ఉన్న వ్యత్యాసాలను తగ్గించడం కోసం దోహదపడేందుకు ఉద్దేశించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌కు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందనీ ఈ చట్టాలను రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకూ వర్తించడం జరిగిందనీ, దీని ప్రకారం మారిన జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వారి దామాషా ప్రకారం వార్షిక బడ్జెట్లలో నిధుల కేటాయింపులు చేయడం జరుగుతుందనీ, కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తన ప్రాధాన్యతా పథకాలకు నిధులను మళ్ళించి, వాటిని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఖర్చుల్లో చూపించడం వలన దళిత గిరిజన వర్గాల వారికి అవసరమైన పథకాలు అలక్ష్యానికి గురవుతున్నాయన్నారు. అంతే కాకుండా ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమని వారి యొక్క కష్టాలను గుర్తించి వారికి తగిన నిధులు విడుదల చేయాలని, వారి యొక్క ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, స్థానిక నాయకులు చల్లా కోటి వీరస్వామి, అల్లం కోటి లింగం, వెన్న ప్రసాద్, తమ్మా రామలింగేశ్వరరావు, చల్లా ప్రసాద్, బండుల విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, ప్రసాద్, మాదాసు ఇందు, అడ్డగర్ల సురేష్, అడబాల మురళి, చాపల రమేష్, జగత్ సోమశేఖర్, పిడుగు మోహన్ బ్రదర్స్, పాలురి బురయ్య, దాగరపు శ్రీను, కాజూరు మల్లేశ్వరరావు, రుద్ర రమేష్, లింగం శ్రీను, రౌతు సోమరాజు, ఏపూరి సాయి, నీలపాల దినేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్, ఎవర్న సోమ శంకర్, భార్గవ్, ఉప్పు నరసింహమూర్తి, బత్తిరెడ్డి రత్తయ్య, వానపల్లి సాయిరాం, ములగాల శివ, ప్రసాద్, ద్వారబంధం సురేషు, నరాల శెట్టి సంతోష్ వీరమహిళలు పెంటపాడు మండల మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మహిళా అధ్యక్షురాలు వెజ్జూ రత్న కుమారి, కందుల విజయ, ప్రశాంతి, మధు శ్రీ, తోటరాణి తదితరులు పాల్గొన్నారు.