విద్యార్థులకు సౌకర్యవంతమైన, సురక్ష ప్రయాణం కల్పించాలి..

  • జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్

గుంటూరు: స్కూల్స్ మరియు కళాశాలలు పునఃప్రారంభం అయిన దృష్ట్యా.. విద్యార్ధుల ట్రావెలింగ్ కి ఉపయోగించే వాహనాలను తనిఖీ చేసి విద్యార్థులకు సౌకర్యవంతమైన సురక్ష ప్రయాణం కల్పించాలని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ కోరారు. స్కూల్ యాజమాన్యానికి ఖచ్చితమైన నియమనిబంధనలు జారీ చేయాలని అధికారులను కోరారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందిన వాహనాలను మాత్రమే అనుమతించాలని కోరారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించే వాహనాలను వెంటనే సిజ్ చేయాలని మరియు అలాంటి స్కూల్ యాజమాన్యంపైన ఖట్టినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసి మంగళవారం ఆర్.టి.ఓ, కమిషనర్ లను కలిసి
వినతిపత్రం అందజేశారు.. ఈ కార్య్రమానికి నగర ఉపాధ్యక్షుడు కొండూరు కిషోర్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శులు ఏడ్ల నాగ మల్లేశ్వరరావు, శ్రీమతి కటకంసెట్టి విజయలక్ష్మి, నగర కార్యదర్శి బండారు రవీంద్ర, తోట కార్తీక్, పి కోటేశ్వరావు, మరియు పులిగడ్డ గోపి, 48వ డివిజన్ అధ్యక్షుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.