క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: బైరపోగు సాంబశివుడు

ఉమ్మడి మహబూబ్ నగర్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు.. జనసేన క్రియాశిలక సభత్వం కిట్ల పంపిణి కార్యక్రమం జూన్ 10, 11, 12 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశిలక సభ్యులకు భీమా పత్రాలు ప్రదానం.. ఇందులో భాగంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రియాశిలక సభ్యులకు కిట్ల పంపిణి కార్యక్రమం 12వ తేదీ.. ఆదివారము ఉదయం 9:30 ని.లకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జరగనుంది.. కావున కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో ఉన్న.. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్న యువజన నాయకులు విద్యార్థి విభాగం నాయకులు, జనసైనికులు, క్రియాశిలక సభ్యత్వం చేయించిన నాయకులు, క్రియాశిలక సభ్యులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలన్సిందిగా కోరడం జరిగింది. శనివారం ఉదయం జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బైరపోగు సాంబ శివుడు కొల్లాపూర్ నియోజక వర్గంలో కంచ ఐలమ్మ విగ్రహం దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు, జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో.. కోడేరు మండల నాయకులు రఘు, బత్తిని బాలు, విజయ్, బైరపోగు రాజు, కలమూరి మహేష్, బచ్చలకూర శివ, జాంగిర్, సాదిక్ పాల్గొన్నారు.