అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: దాసరి రాజు

ఇచ్చాపురం: అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు వారి యొక్క ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఇచ్చాపురంలో మానవహారం చేపట్టారు. మానవహారానికి ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు మద్దతు ప్రకటించారు. అంగన్వాడి టీచర్లు మరియు ఆయాలకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి, వారికి న్యాయం చేయాలని అన్నారు. అంగన్వాడీలో పనిచేస్తున్న వీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారు. కాబట్టి వారి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని జనసేన పార్టీ తరఫున దాసరి రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన నాయకులు మండల అధ్యక్షురాలు దుర్గాసి నీలావేణి, 11వ వార్డ్ ఇంచార్జ్ కలియ గౌడ్, ఢిల్లీ. అజయ్, సతీష్, దుర్యోధన రెడ్డి, మనీ, అశోక్, జనసైనికులు పాల్గొన్నారు.