ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం: జనసేన జానీ

పాలకొండ నియోజకవర్గం జనసేన జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మీడియట్ ఫలితాలులో మార్కులు తక్కువ వచ్చాయనే కారణంగా ఫెయిల్ అయ్యాం అనే కారణంతో 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోని మరణించడం చాలా తీవ్రంగా నా గుండె నన్ను బాధపెడుతుంది. మన జీవితంలో ఇంటర్ మాత్రమే ముఖ్యం కాదు, మనకు మన కుటుంబం, మన చుట్టూ ప్రాంతం, మన సొసైటీ చాలా ముఖ్యం. మనం ఆరాధించే ఎంతోమంది గొప్ప వారు కనీసం 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. అలాంటి వారు ఈ దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు క్రికెట్ లో స్టార్స్, సినిమాలో స్టార్స్ గా వెలుగొందుతున్నారు. మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్ ఫెయిల్ ఐనారు. అలాంటి వ్యక్తి సినిమాలో పవర్ స్టార్ గా, రాజకీయంలో ఓ గొప్ప నేతగా, సమాజంలో ఎంతోమందికి పలు సేవలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ, దేశ విదేశాల్లో ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. కనుక ఇకపైన ఏ విద్యార్థులు కూడా జీవితంలో ఎవ్వరు ఏమి కోల్పోయినా, ఎందులో ఓటమి చెందినా వెంట్రుకతో కాలు కింద దూలితో చూడాలే తప్ప మరణించడం తప్పు బ్రదర్స్. జీవితంలో సాధించడానికి కావలిసింది పోరాటం ప్రయత్నమే చేస్తూ గొప్ప స్థాయిలోకి చేరాలి అని మనసారా కోరుకుంటున్నానని జానీ అన్నారు.