దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోండి

సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో శుక్రవారం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించి నాసిరక విత్తనాల వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి. దానిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజల చేత రెండుసార్లు ఓట్లు వేసుకొని గెలిచి వ్యవసాయ శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గమైన సర్వేపల్లిలో 100 ఎకరాలకు పైబడి చెర్లోపల్లి గ్రామంలో నాసిరకం విత్తనాలు ఇవ్వడం వల్ల పంట పూర్తిగా దెబ్బతిని పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. మరి ఆ రైతులని, ఆ రైతు కుటుంబాల్ని ప్రభుత్వం గానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వచ్చి మీ ఆదుకుంటాం అని, నష్టపరిహారం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన దాఖలు లేవు. వాళ్ళు ఈరోజు రైతులు మండల కార్యాలయాలు చుట్టూ, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాలా రైతే ఎన్నుముక అటువంటి రైతు ఈరోజు ఆరుగాలం పండించే పంటకి నష్టం వాటిల్లి నాసిరకం విత్తనాలు వల్ల వాళ్లు పూర్తిగా కుటుంబాలు చిన్నబిన్నమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి తాము ఒకటే కోరుతున్నాయి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని దయచేసి మీ రాజకీయాలను పక్కనపెట్టి ఇక్కడ దెబ్బతిన్న పంటకి నష్టపరిహారం అందించే విధంగా మీరు అడుగులు ముందుకు వేసి రైతులకు ధైర్యం చెప్పి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అలా జరగని పక్షంలో ఆ రైతులకు అండగా నిలబడి జనసేన పార్టీ పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు వాళ్లకి అండగా నిలబడతాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు గుమినేని వాణి భవాని మనుబోలు మండల నాయకులు ఖాదర్ వలీ, జాకీర్, పవన్, కోటిరెడ్డి, స్థానిక టిడిపి నాయకులు అశోక్, జనసేన స్థానిక నాయకులు సుధాకర్, సుబ్రమణ్యం, ముత్తుకూరు మండల నాయకులు అశోక్, సుమన్, మురళి, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.