జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
ఆముదాలవలస నియోకవర్గం, అల్లేన గ్రామంలో రాత్రి పూట సమయంలో కూడా జనసైనికులు జోష్ చూపించారు. జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరరావు మరియు సిక్కోలు ఎంపీటీసీ అంపిలి విక్రమ్ ఆధ్వరంలో.. అల్లెన గ్రామంలో కార్యకర్తలకు దాదాపుగా 50కిట్లు పంపిణీ చేయడం జరిగింది. చీకటి పడినా జనసేన కార్యకర్తలు గణేష్, ఆనంద్, కాశీ, వెంకీ, మోహన్, కిరణ్ మరియు తదితరులు నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.