తాడేపల్లిగూడెం: అంబరాన్నంటిన జనసేన నూతన సంవత్సర సంబరాలు

తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. అదేవిధంగా ఈ సంబరాలలో భాగంగా మత పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ ను ఆశీర్వదించడం జరిగింది. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు మరియు వీరమహిళలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, 2023లో సరికొత్త ఆశలు లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన నాయకులు జనసేన వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.