పోతిరెడ్డిపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

తెలంగాణలో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గెలుపే దిశగా పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమంలో భాగంగా శనివారం పోతిరెడ్డిపల్లి గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేపట్టారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ నాయకులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు, గ్రామ జనసైనికులు ఉత్సాహంతో అధిక సంఖ్యలో పాల్గొని పోతిరెడ్డిపల్లి గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ పాదయాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ శనివాఅరంతో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మూడో విడతగా పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 35 రోజుగా, 70 గ్రామాలు, 13 వేల గడప తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకు కొనసాగుతుంది. గ్రామంలోని ప్రజల ఆశీర్వాదంతో జనసేన పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గంలో మార్పును తీసుకొస్తాం. ప్రశ్నించే ప్రతివాడు నాకు బామ్మర్ది అని వ్యాఖ్యానించిన స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ప్రతి గ్రామానికి ఒక బామ్మర్ది ఉంటాడు అని అన్న మీకు, 130 గ్రామాల్లో 130 బామర్ధులు ఉంటారు. అందులోని నీ ముద్దుల బామ్మర్ది వంగ లక్ష్మణ్ గౌడ్ అనే నేను ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పేలా చేస్తాను. దమ్ముంటే మీ ప్రభుత్వం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ఒక్కొక్క గ్రామానికి ఎంత మందికి దళిత బంధు ఇస్తున్నారో లిస్ట్ విడుదల చేసి తరువాత ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిపాలన కోటి రూపాయలతో చెరువు కట్ట టాంక్ బండ్ కట్టించి దాని కింద ఉన్న నల్లమట్టిని దోచుకు తిన్నటువంటి వైనం, ప్రజలు గుర్తించే రోజులు వచ్చాయ్. స్థానిక ఎమ్మేల్యేని ఢీ కొట్టడానికి నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, జనసైనికులు మరియు వీరమహిళలు ఇచ్చినటువంటి ధైర్యం ఉంది. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాలు తల ఎత్తుకునే విధంగా ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన కీ.శే వి.ఎన్ గౌడ్ ఆశయం పుంజుకొని పుట్టిన బిడ్డను. నా చివరి వరకు నాగర్ కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధికై పాటుపడతానని నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే నా జీవితానికి తుది శ్వాస అని వంగ లక్ష్మణ్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు గోపాస్ కుర్మన్న మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుండి వంగ లక్ష్మణ్ గౌడ్ పోటీ చేస్తున్నారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి, వంగ లక్ష్మణ్ గౌడ్ ని అసెంబ్లీకి పంపుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పి.అర్. రాఘవేంద్ర మాట్లాడుతూ పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తుంది, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా లక్ష్మణ్ అన్నను పిలిపించుకొని అభినందించారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మా అన్న లక్ష్మణ్ అన్నని అసెంబ్లీకి పంపడం కోసం మా శక్తి మేరకు మేము బలంగా కష్టపడతామని అన్నారు. ఈ సందర్భంగా గొపాస్ రమేష్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నియోజకవర్గలో జనసేన జెండా ఎగరెస్తాం. పవన్ కళ్యాణ్ మాకు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో వంగ లక్ష్మణ్ గౌడ్ రూపంలో దొరికారు. పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి వాళ్ళ శ్రేయస్సు కొరకై వంగ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 40 సంవత్సరాలనుండి ఒక వర్గ పాలనలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలు విసుకెత్తిపోయారు. 40 సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి బహుజన రాజ్యాధికారం ఏ కుటుంబంతో అయితే ఎండ్ అయిందో తిరిగి అదే కుటుంబం నుంచి వంగ బిడ్డ, మీ ఇంటి బిడ్డగా వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్ పాదయాత్రలో మేము పాదం కదుపుతాం అంటూ కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేసిన జనసేన వీర మహిళలు అశ్విని, గాయత్రి, మమత, హారిక, మరియు జనసైనికుడు వినోద్ పాల్గొన్నారు. మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు ఎడ్ల ప్రసాద్, విజయ్ భాస్కర్ గౌడ్, సూర్య, మూర్తి నాయక్, ఆంజనేయులు, సత్యం, వంశీ రెడ్డి, రాజు నాయక్, పవన్, ఎడ్ల రాకేష్, పూస శివ, గౌరవ్, మహేష్, శ్రీకాంత్, బాలకృష్ణ, జీవన్, మహేష్ గౌడ్, ఆరిఫ్, చంద్రశేఖర్, నాగేష్, వెంకటేష్, శివ, ప్రదీప్, చందు, సంజు, పాష తదితరులు పాల్గొన్నారు.