తలైవా రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖరారు..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీని ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నానని  అధికారిక ప్రకటన చేసిన సంగతి విదితమే. కొత్త పార్టీకి చీఫ్ కో-ఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్‌వైజర్‌గా తమిళ్రూవి మణియన్‌ను నియమించినట్లు అధికారిక ప్రకటన చేయగా.. తాజాగా రజినీకాంత్ కొత్త పార్టీకి పేరు, గుర్తు కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. రజినీకాంత్ పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ'(ప్రజాసేవ పార్టీ) అనే పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అలాగే ఆయన పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కర్చీ’ పోటీ చేసే అవకాశముంది.

అంతకుముందు రజినీ ‘బాబా లోగో’ను అడగగా.. దానిని కేటాయించడానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. కాగా, పార్టీ పేరు, జెండా, ఇతర విషయాలను రజినీకాంత్ డిసెంబర్ 31న అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.