బోనకల్ అఖిలపక్ష సమవేశంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్

బోనకల్ తెలంగాణ విలీన జాతీయ సమైక్యత వార్షికోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఎంపీపీ ఎంపీడీవో ఎస్సై ఎంఆర్ఓ అధికారుల అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో భాగంగా జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్ళూరి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి దుంపాటి శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి మిరియాల రామకృష్ణ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు డేగల రామచంద్రల సూచన సలహాలతో అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న బోనకల్ మండల అధ్యక్షులు తాళ్లూరి డేవిడ్. ఈ సందర్భంగా తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో పాల్గొని ఆంగ్లేయుల నిజాముల మీద తిరుగుబాటు చేసి మనందరికీ స్వేచ్ఛను కల్పించి వారి ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి వారి ప్రాణాలను అర్పించిన మహానుభావులు అందరికీ జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నామని అదేవిధంగా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబాలకు పింఛన్ రూపంలో ఆదుకోవాలని వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. వారికి కుటుంబాలకి న్యాయం జరిగిన రోజే నిజమైన తెలంగాణ మలిదశ విలీన సమైక్యత వార్షికోత్సవ రోజులు అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ జానీ పాషా, అఖిలపక్ష పార్టీల అధ్యక్షులు గ్రామ సెక్రెటరీలు మండల అధికారులు తదితరలు పాల్గొన్నారు.