అమ్మిశెట్టి వాసుకి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసుని మరియు విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త పోతిన వెంకట మహేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. ఈఎ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండల జనసేన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు షేక్ యాసిన్, ఉపాధ్యక్షులు చింతల తేజ, మండల ప్రధాన కార్యదర్శులు చింతల పండు, మరి బోయిన మహేష్, తోట కృష్ణ కిషోర్, శాలి నాగరాజు పలువురు పాల్గొన్నారు.