మట్టి వినాయకుని పూజిద్దాం – జీవకోటి మనుగడ సాధిద్దాం: తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం, గొల్లప్రోలు నగర పంచాయితీ నందలి సాయిబాబా గుడి వద్ద సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ పిలుపునందుకుని పవన్ కళ్యాణ్ ఆదర్శభావాలతో జ్యోతుల శ్రీనివాసు మట్టి విగ్రహాల పంపిణీ చేయడం చాలా ఆనందదాయకమని జ్యోతుల శ్రీనివాసు సేవలను కొనియాడారు. అనంతరం వినాయకుని మనం పూజించినట్లయితే పర్యావరణాన్ని పూర్తిగా మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం కానీ, నేటి కాలంలో మట్టి వినాయకుని ప్రత్యామ్నాయంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్, ఆయిల్ వంటి గుణాలు కలిగిన విగ్రహాలను పూజించి నవరాత్రుల అనంతరం కాలువలు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణాలన్నీ పూర్తిగా నాశనం చేసుకోవడం జరుగుతుందని, దీని కారణంగా ప్రాణకోటికి ప్రాణసంకట పరిస్థితి ఏర్పడుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాన్ని పూజించాలని జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సాయి ప్రియసేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు & జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ సాయిప్రియ సేవాసమితి ఎల్లప్పుడూ సమాజశ్రేయస్సు కోసం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టివినాయకుని పూజించి అనంతరం మట్టి వినాయకుని నిమజ్జనం చేసినట్లయితే మన పర్యావరణం ఏ విధమైన కాలుష్యం లేకుండా సక్రమంగా ఉంటుందని, దీని కారణంగా ప్రాణకోటి అంతా కూడా సురక్షితంగా ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణేష్ ఉత్సవాలను మట్టి వినాయకుడితోనే నిర్వహించుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదర్శభావాలలో “పర్యావరణ పరిరక్షణ” ఒక భాగం కాబట్టి జనసేనాని పిలుపుమేరకు ప్రతిఒక్కరూ కూడా మట్టివినాయకుని పూజించాలని, ఇందుమూలంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటు చేసిన మట్టివిగ్రహాలను మొట్టమొదటిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ్యోతుల శ్రీనివాస్ చేతులపై ఒక మట్టి విగ్రహాన్ని తీసుకున్నారు. అనంతరం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వెన్నపు చక్రరావు వినుకొండ అమ్మాజీ, బుల్లెట్ వాసు, దాసరి కిరణ్, గొల్లప్రోలు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు చేతులపై అక్కడకు విచ్చేసినటువంటి గొల్లప్రోలు నగరప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్, నల్లం{బుల్లెట్} వాసు, వెన్నాపు చక్రరావు, మామిడాల సూరిబాబు, తలారి శ్రీనివాస్, బుడంకాయల దొరబాబు, బసవ సోమరాజు{బాబ్జి}, మామిడియాల దొరబాబు, వినుకొండ అమ్మాజీ, తలారి కామరాజు, ఊటుకూరు దొరబాబు, కొల్లి దుర్గాప్రసాద్, పంచ శ్రీనివాసు, కామిరెడ్డి విష్ణు కీర్తి చంటి, పిడక బుజ్జి, హరిక శ్రీను, నారపు ఏసుబాబు, అనిశెట్టి నూకరాజు,దేవరపు సారథి, రెడ్నం శ్రీకాంత్, కడిరెడ్ల సత్తిబాబు, గుండుపల్లి శివరాం, తాతాజీ, చెల్లూరి మహేష్, కోలా వీరబాబు, గంటా గోపి, దమ్ము చిన్న, మేడిపోయిన సత్యనారాయణ, బండి శివ, పోలం త్రిమూర్తులు, జ్యోతుల కోటిబాబు, జ్యోతుల శివ పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్

పిఠాపురం, ఉప్పాడ జనసేన నాయకులు కొండబాబు ఆహ్వానం మేరకు ఆదివారం ఉప్పాడ ఫుల్ గాస్పాల్ హాఫ్ క్రిస్ట్ చర్చిలో పాస్టర్‌ స్టీఫిన్ రాజ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ వేల మంది ఉన్న ఈ చర్చ్ లో మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ప్రజా సేవా కొరకు నేను ఈ పిఠాపురానికి వచ్చానని స్వయంగా ఉప్పాడలో ఉన్న ఈ చర్చ్ గురించి ప్రత్యేకంగా తెలుసుకొని ముందుగా మీ యొక్క ఆశీర్వాదం తీసుకుందామని ఈ సంఘానికు విచ్చేయడం జరిగిందని మరియు 25వేల మందికి పైగా ఉద్యోగ అవకాశలు కల్పించానని, కొన్ని వందల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా దేవుని కృపతో తీర్చిదిద్దానని తెలియజేసారు. అనంతరం బాల్యంలో దాదాపు కొన్ని వందల దేవుని పాటలు నేర్చుకున్నానని, ఊహ తెలిసి నేను మొట్ట మొదటి పాట సోమేశ్వరం అనే గ్రామంలో ఉన్న చర్చ్ లోనే పాడాను అని గుర్తుచేస్తూ ఈ సందర్బంగా పాస్టర్ యొక్క విశిష్టతను ప్రత్యేకంగా కొనియాడారు.

ఆయన్ష్ మొదటి పుట్టినరోజు వేడుకలలో జనసేన సిద్ధాంతాల బ్యాగుల పంపిణీ

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణంలో జనసేన నాయకులు బొజ్జ సునీల్ సునీత దంపతుల కుమారుడు ఆయన్ష్ మొదటి పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ హాజరు అయ్యి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుటుంబానికి పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనసేన 7 సిద్ధాంతాలు ఉండేలా ప్రత్యేకంగా తయారుచేసిన ఫ్లాస్టిక్ రహిత బ్యాగ్ లను అందజేశారు.