కుళాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీరు అందించాలి: జనసేన డిమాండ్

విశాఖ మన్యం అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం, కొండిబ పంచాయితీ పరిధిలో గలమువ్వం గూడ గ్రామాల్లో శనివారం ఉదయం జనసేన బృందం ఆధ్వర్యంలో పర్యటించడం జరిగినది. పర్యటనలో భాగంగా గ్రామస్తులతో సమావేశమై సమస్యల పట్ల చర్చించడం జరిగినది. ముఖ్యంగా ఆయా గ్రామంలో కులాయి మరమత్తు అవడం వలన మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లు జనసేన పార్టీ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సాయిబాబా, దురియా, సన్యాసిరావు తదితరులు మాట్లాడుతూ ముందుగా జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్లారు, అనంతరం మువ్వంగూడ గ్రామంలో కుళాయి మరమ్మతులు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, తక్షణమే ప్రభుత్వ సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కోలాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీరు అందించగలరని ఈ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేల నుండి ఆకాశం అందే వరకు నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వైయస్సార్ పార్టీకి బుద్ధిచెప్పాలని, జనసేన పార్టీని ఆదరించాలని గిరిజనులను సూచించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, నర్సింగ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.