జగన్ రెడ్డి వ్యాఖ్యలకు అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ కౌంటర్

  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కృష్ణాజిల్లా అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్!!

కృష్ణ డిస్ట్రిక్ట్: తెలంగాణలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరుఫున 8 మంది అభ్యర్థులు బరిలో దిగి పోరాడడం జరిగింది, ఇదే జగన్ రెడ్డి 2014లో వైసీపీ అభ్యర్థులను పోటీ చేయిస్తే కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ రాని పరిస్థితి నీది, నీ పార్టీది. తర్వాత నిన్ను వరంగల్లో రాళ్లు పట్టుకుని కొడితే పారిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చిన నువ్వు ఈ రోజు కళ్యాణ్ గారి గురుంచి జనసేన పార్టీ గురుంచి మట్లడుతుంటే వింతగా ఉంది, మీ సొంత చెల్లి పార్టీ నడపలేక విలీనం చేసే పరిస్థితిలో పోటినుండి తప్పుకుని వేరే పార్టీకి మద్దతు ఇచ్చిన ఆమె, పోనీ నువ్వు ఆంధ్రప్రదేశ్ లో 151 మంది ఎమ్మెల్యే లు ఉండి బయపడి కనీసం పోటీ కూడా చేయలేదు. బర్రెలక్క కనీసం పోటీ చేసింది. నువ్వూ, నీ సొంత చెల్లి పోటీ నుండి పారిపోయారు. తల్లి ఏమో విశాఖలో ఒక అనామకుడి చేతిలో ఓడింది. గతం అంతా తెలిసి కూడా నీవు మాట్లడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చూసి పడవాల్సిన స్థితి. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో నీవు ఇలా మతిస్థితి లేక ఏం మాట్లడుతున్నావో తెలియక, నిన్ను చూస్తుంటే జాలి పడాలో సిగ్గు పడాలో తెలియని పరిస్థితి. నువ్వు తెలంగాణ ఎన్నికల్లో పోటీ మాట్లడితే బాగుండేది, అప్పుడు నీ చెల్లి బర్రెలక్క కూడా సంతోష పడేది. నువ్వు పీఠం ఎక్కగా, నీ తల్లి – చెల్లి నీ నుండి దూరం అయ్యి నీపై విమర్శలు చేస్తుంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇంకో రెండు నెలలో ప్రజలు కూడా దూరం పెడతారు అని, ప్రజా ప్రభుత్వ సభలలో నీవు మాటతీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామని తెలిపారు.