ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం టీడీపీ, జనసేనలు కలిసి వ్యూహంతో ముందుకెళ్తున్నాయి

సర్వేపల్లి: వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామం నందు ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పొత్తులతో జనసేన, టిడిపి ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ఫ్రస్టేషన్ లో వున్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను మభ్యపెట్టి మసిబూసి మారేడు కాయ చేస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన వైసిపి ప్రభుత్వానికి 2024 ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెబుతారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం విజయవంతంగా వారాహి విజయ యాత్ర కొనసాగిస్తున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలుస్తామంటే తాము చూస్తూ ఊరుకోం, వ్యక్తిగత విమర్శలు చేయడం తమకు వచ్చు. రాబోయే ఎన్నికల్లో వైసిపికి డిపాజిట్లు కూడా రావు, వైసిపి కనిపించకుండానే పూర్తిగా భూస్థాపితం అవుతుంది. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా టిడిపి, జనసేన పార్టీలు కలిసి స్థాపించబోయే ప్రజా ప్రభుత్వానికి మద్దతు పలకాలి. ఈ కార్యక్రమంలో స్థానికులు పాలపర్తి ఓబయ్య, చిరంజీవి యువత అధ్యక్షుడు కాజా, మండల కార్యదర్శి శ్రీహరి, సాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.