Kothapeta: అనుచరులతో జనసేనలో చేరిన టిడిపి నేత

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామం శేరేపాలెంకు చెందిన టీడీపీ నాయకుడు మాజీ కోపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్. కొత్తపేట ఏఎంసి మెంబెర్ మండల మాజీ తెలుగు రైతు అధ్యక్షులులాంటి పలు పదవులు నిర్వర్తించిన తులా రాజు తన అనుచరులు గ్రామస్థులు సుమారు 100 మందితో తెలుగుదేశం పార్టీని వీడి కొత్తపేట జనసేనపార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్ అద్వర్యంలో జనసేనపార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ పార్టీల్లో కీలకపాత్ర పోషించిన ఇటువంటి నాయకులు ఎంతో మంది నేడు, ఎంతో పేరు ప్రఖ్యాతలు ధనాన్ని ఆర్జించే అవకాశం ఉన్నా తృణప్రాయంగా విడనాడి ప్రజాసేవకు అంకితమై అహర్నిశలు శ్రమిస్తున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, నచ్చి నియోజకవర్గంలో అనేకచోట్ల ప్రజలు కార్యకర్తలు ముందుకు వస్తున్నారని ఇంకా అనేకమంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొత్తపేట మండలంలోని పలివెల శేరేపాలెం నుండి పార్టీలోకి వచ్చిన తులా రాజు అతని అనుచరులను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.