దేవరకొండ హరీష్ కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

అనంతపురం జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, ఎనుములపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు దేవరకొండ హరీష్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్ మరియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి. అకాల మృతి చెందిన జనసైనికుడు దేవరకొండ హరీష్ కుటుంబానికి చేయూతగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి సమక్షంలో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య 100000/- లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. హరీష్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది.