నూజివీడు జనసేన ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

నూజివీడు నియోజకవర్గం: భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశం చేసి వారికి బాధ్యత, చదువు చెప్పే గురుదేవులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరుపున రాబోయే జనసేన ప్రభుత్వంలో సీపీఎస్ ను రద్దు చేయడంతో పాటు పీఆర్సి, వేతన సవరణ, సకాలంలో జీతాలు అందేలా చూస్తామని నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు ఆధ్వర్యంలో నూజివీడు మండల పడమర దిగవల్లి ప్రధానోపాధ్యాయురాలు, ముసునూరు మండలంలోని రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులను సన్మానించి, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబుతో పాటు ఉప్పే నరేంద్ర, వేట త్రినాథ్, చేకూరి అనిల్, సాయి, సతీష్, పడమర దిగవల్లి గ్రామ నాయకులు చిలీ సతీష్, సాయి జనసైనికులు పాల్గొన్నారు.