టేకు చెట్లు దొంగను వైఎస్ఆర్సీపీ నుండి సస్పెండ్ చేసి ఎమ్మెల్యే చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

  • నేను ఏమి చేసినా ఎమ్మెల్యేకి చెప్పే చేస్తాను అంటున్న టేకు చెట్ల దొంగ దులపుడి రవి చేస్తున్న ఆరోపణలకి మీరు మీడియా ఎదుట వివరణ ఇవ్వాలి
  • టేకు చెట్లు నరికిన దొంగకి ఫైన్ ఒక్కటే కాదు వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలి
  • అధికార పార్టీ చట్టం ప్రకారం కాకుండా ఫారెస్ట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి
  • జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు. శివరామకృష్ణ

నూజివీడు, వెంకటయపాలెం అటవీ ప్రాంతంలో భూపతీగట్టు సమీపంలో కోట్ల విలువ చేసే టెేకు చెట్లను నరికిన దొంగను ఫారెస్ట్ అధికారులు ఫైన్ ఒక్కటే వేసి చేతులు దులుపు కోవాలని చూస్తున్నారనీ తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారిపై అధికార పార్టీ చట్టాలు కాకుండా, ఫారెస్ట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలనీ జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నేరం ఒప్పుకొని 2,64,000/- ఫైన్ కట్టిన దొంగ దులిపుడి.రవి ని వైఎస్సార్సీపీ నుండి ఎమ్మెల్యే సస్పెండ్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నేను ఏమి చేసినా ఎమ్మెల్యేకి చెప్పే చేస్తాను అంటున్న దులపుడి.రవి ఆరోపణలపై ఎమ్మెల్యే మీడియా ఎదుట వివరణ ఇవ్వాలన్నారు. ఇవ్వకుంటే ఈ టేకు చెట్లు దొంగతనం మీకు తెలిసే జరిగింది అని నూజివీడు ప్రజలు భావిస్తారు అన్నారు. 30 ఏళ్ల పైబడిన 107 టేకు చెట్లను నరికి 17 చెట్లను అక్కడి నుంచి ఎత్తుకెల్లిపోతే అడవి శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. 107 టేకు చెట్లు దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి 2,64,000/- వేసినట్లు రాత పూర్వకంగా తెలిపిన అధుకారులు వారిపై కేసులు నమోదు ఎందుకు చేయలేదు అని శివరామకృష్ణ ప్రశ్నించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల నుండి లంచాలు తిని అధికారులు చేతులు దులుపుకోవడనికి చూస్తున్నారు అన్నారు. అలాగే ఇక్కడ సర్వేనెంబర్ 1/1,1/2 కోర్ట్ వివాదంలో ఉన్న పట్ట భూమిలో ఉన్న చెట్లును ఎవ్వరి అనుమతి లేకుండా నరికినట్లు తెలుస్తుందని ఆ పొలం యజమానినీ ఇంతవరకు విచారించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. అటవీ శాఖ ట్రాస్క్ పోర్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుజాత, శ్రీనివాస్ విచారణకి వచ్చినా పై పై విచారణ చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి టేకు దొంగలను, నూజివీడు పుష్ప-2 లను, వెనుకనుండి సహకరించిన మంగళం శ్రీను పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చేయకుంటే 19న సోమవారం నూజివీడు వచ్చిన కలెక్టర్ గారికి స్పందనలో జనసెన పార్టీ ఫిర్యాదు మేరకు డి.ఎస్.పికి పరిష్కారం చేయమని చెప్పారు. స్పందనలో పిర్యాదు పరిష్కారం అయింది అని మెసేజ్ వచ్చింది. నా సంతకం లేకుండా ఎలా క్లోజ్ చేశారు అని ఆయన ప్రశ్నించారు. స్పందన పిర్యాధుని మళ్ళీ రీ ఓపెన్ చేయమని కలెక్టర్ ని కలిసి, నా అనుమతి లేకుండా పిర్యాదు క్లోజ్ చేయడంపై కూడా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి, ఫైన్ వేసి కేసు నమోదు చేయకుండ తప్పించాలని అని చూస్తున్న విషయాని కూడా చెప్పి కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తే వరకు జనసేన పోరాడుతుందన్నారు.