పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టీం పిడికిలి పోస్టర్ ఆవిష్కరణ

రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతులకు అండగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 30 కోట్ల రూపాయల సహాయం అందజేస్తున్నారు. దీని నిమిత్తం పిడికిలి టీమ్ వారు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ ను రామచంద్రపురం పట్టణము జనసేన పార్టీ కార్యాలయంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ మండల అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.