రెండో వన్డేలోనూ టీమిండియాదే ఫస్ట్‌ బ్యాటింగ్‌..

పూణె: భారత్‌తో పూణే వేదికగా శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో టీమిండియా రెండో వన్డేలోనూ మొదట బ్యాటింగ్‌ చేయనుంది. గత మంగళవారం ఇక్కడే జరిగిన తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈరోజు భారత్‌ తుది జట్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒక మార్పు మాత్రమే చేశాడు. గాయపడిన శ్రేయాస్‌ అయ్యర్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌ను జట్టులోకి తీసుకున్నాడు. దీంతో తొలి వన్డేకు కీపర్‌గా ఉన్న కెఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ పాత్రకే పరిమితం కానున్నాడు.

ఇంగ్లాండ్‌ కెప్టెన్సీ మార్పు.. ఇంగ్లాండ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ చేతి వేలికి తీవ్ర గాయమవ్వడంతో అతను వన్డే సిరీస్‌ నుంచి వైదొలిగాడు. దీంతో మోర్గాన్‌ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా జోస్‌ బట్లర్‌ బాధ్యతలు తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌ తుది జట్టులో మూడు మార్పులు చేశారు. కెప్టెన్‌ మోర్గాన్‌ స్థానంలో డేవిడ్‌ మలాన్‌ జట్టులోకి రాగా.. గాయపడిన శామ్‌ బిల్లింగ్స్‌ స్థానంలో లివింగ్‌ స్టోన్‌, మార్క్‌వుడ్‌ స్థానంలో టోప్లీ ఎంట్రీ ఇచ్చారు.